గుంటూరు జిల్లా వైకాపా నేతల తీరును తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర విమర్శించారు. వైకాపా నేతలకు దమ్ముంటే ఎన్నికలకు ముందుకురావాలని సవాల్ విసిరారు. రైతులను పోలీసులు బూటు కాలుతో తన్నుతుంటే హోంమంత్రి ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. మహిళల పట్ల పోలీసులు నిరంకుశంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు కావాలో జగన్ కావాలో వైకాపా నేతలు తేల్చుకోవాలని చెప్పారు.
'వైకాపా నేతలూ.. ప్రజలు కావాలో జగన్ కావాలో తేల్చుకోండి' - వైసీపీపై దూళిపాళ్ల నరేంద్ర కామెంట్స్
గుంటూరు జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు 3 రాజధానుల ప్రతిపాదనకు మద్దతుగా మాట్లాడటం సిగ్గుచేటని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములిచ్చిన రైతులను, వారి త్యాగాలను వైకాపా నేతలు అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.
'ప్రజలు కావాలో జగన్ కావాలో తేల్చుకోండి'