కరోనా వైరస్ నేపథ్యంలో ప్రైవేటు వైద్యశాలల్లో ప్రభుత్వ నియంత్రణ పెరగాలని కోరుతూ సీపీఎం డిమాండ్ చేసింది. గుంటూరులో సీపీఎం కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. కరోనా పాజిటివ్ వ్యక్తుల నుంచి పెద్ద ఎత్తున ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేస్తున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు పేర్కొన్నారు. మరోవైపు పాజిటివ్ వచ్చి ఆసుపత్రిలో చేరాలనుకున్న వారికి అరగంటలో బెడ్ సిద్ధం చేయాలన్న సీఎం...క్షేత్రస్థాయిలలో ఐదు రోజులు గడిచిన పేషెంట్లకు బెడ్‌లను సమకూర్చటం లేదన్నారు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయాలని కోరితే వారం రోజులు సమయం తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఫలితాలు రావాలంటే మరో ఐదు రోజులు సమయం పడుతుందన్నారు. వైరస్ నిర్ధారణ పరీక్షలను వెంటనే చేసేల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఫలితాలను అదే రోజు వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు.
'ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక ఫీజులను నియంత్రించాలి' - cpm leaders protest in front of cpm office guntur
గుంటూరు జిల్లా సీపీఎం కార్యాలయం వద్ద జిల్లా కార్యదర్శి పాశం రామారావు ధర్నా చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రైవేట్ వైద్యశాలల్లో ప్రభుత్వ నియంత్రణ పెరగాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కోరోనా బాధితుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.
గుంటూరు సీపీఎం కార్యాలయం వద్ద ధర్నా