ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మాచర్ల ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు' - మాచర్ల ఘటనపై గౌతమ్​ సవాంగ్​

మాచర్ల దాడి ఘటనను పోలీసులే సుమోటాగా తీసుకున్నారని... ఎవరూ ఫిర్యాదు చేయలేదని డీజీపీ గౌతమ్​ సవాంగ్​ చెప్పారు. నిందితులపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లలో 43 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. చిన్న ఘటనపై.. కొందరు అందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

dgp goutham swang on macharla incident
మాచర్ల ఘటనపై గౌతమ్​ సవాంగ్ వ్యాఖ్య

By

Published : Mar 14, 2020, 3:52 PM IST

మాచర్ల ఘటనపై గౌతమ్​ సవాంగ్ వ్యాఖ్య

గుంటూరు జిల్లా మాచర్ల దాడి ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని... పోలీసులే సుమోటోగా తీసుకున్నారని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. నిందితులపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని.. వారికి రిమాండ్​ విధించామని చెప్పారు. ఈ ఘటనపై అనేక రకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయన్నారు. పోలీసులకు చెప్పే మాచర్ల వెళ్లామని బాధితులు చెబుతున్నారని అన్నారు. పోలీసులకు ఎప్పుడు చెప్పారో, ఎవరు చెప్పారో ప్రశ్నిస్తామని తెలిపారు. రాజకీయ విమర్శలపై తాము సమాధానం చెప్పలేమని స్పష్టం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లలో 43 ఫిర్యాదులు వచ్చాయని... వాటిలో స్పష్టమైన వివరాలు ఉంటేనే చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు. చిన్న విషయాలకూ కొందరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details