ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసులున్నది.. ప్రజల సేవ కోసమే: డీజీపీ - ఏపీలో లో పోలీసు అమరవీరుల వారోత్సవాలు

పోలీసు అమరవీరుల వారోత్సవాలతో సాధారణ ప్రజలకు పోలీసుల గురించి తెలిసిందని డీజీపీ గౌతమ్​ సవాంగ్​ హర్షం వ్యక్తం చేశారు.

పోలీసు అమరవీరుల వారోత్సవాలపై డీజీపీ

By

Published : Oct 19, 2019, 1:38 PM IST

పోలీసు అమరవీరుల వారోత్సవాలపై డీజీపీ

పోలీసులు ఉన్నది ప్రజా సేవ, ప్రజా భద్రత కోసమేనని డీజీపీ గౌతం సవాంగ్‌ స్పష్టం చేశారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సాధారణ ప్రజలకు పోలీసుల గురించి తెలిసిందన్నారు. ఇప్పటివరకు 1.4 లక్షల మంది విద్యార్థులు పోలీస్‌ స్టేషన్లను సందర్శించారని తెలిపారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా విద్యార్థులు, పోలీసులకు పోటీలు నిర్వహించినట్లు డీజీపీ వెల్లడించారు.

రోడ్డు భద్రత, సాంకేతిక పరిజ్ఞానం, పోలీసుల ఆయుధాలు ప్రదర్శించినట్లు డీజీపీ తెలిపారు. 2,511 పాఠశాలల నుంచి 1.84 లక్షల మంది విద్యార్థులు వచ్చారని వెల్లడించారు.

పోలీసులకు వారాంతపు సెలవు అమలు చేస్తున్న రాష్ట్రం ఏపీనే అని డీజీపీ తెలిపారు. త్వరలో పోలీసులకు వీక్ ఆఫ్ యాప్‌ ప్రారంభిస్తున్నట్లు డీజీపీ పేర్కొన్నారు. ఈనెల 21న విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో పోలీసు సంస్మరణ దినోత్సవం జరపనున్నట్లు గౌతమ్​ సవాంగ్​ అన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి రూ.40 లక్షల బీమా పథకం ఇస్తున్నట్లు తెలిపారు

ABOUT THE AUTHOR

...view details