NG Ranga University: గుంటూరు జిల్లా ఆచార్య ఎన్.జి.రంగా విశ్వవిద్యాలయానికి అరుదైన అవకాశం దక్కింది. వ్యవసాయ డ్రోన్ పైలెట్ శిక్షణ ఇచ్చేందుకు వర్సిటీకి డీజీసీఏ అధికారులు అనుమతించారు. ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డ్రోన్ శిక్షణ కార్యక్రమం నిర్వహణకు అవసరమైన అనుమతులు ఇవ్వడానికి ముందు ఇక్కడి పరిస్థితులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సంచాలకులు డాక్టర్ జితేందర్ లౌరా పరిశీలించారు.
వ్యవసాయ డ్రోన్ల నిర్వహణపై 12రోజుల కోర్సులో శిక్షణ ఇచ్చేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని పరిశోధన కేంద్రానికి అనుమతించారు. డ్రోన్ పైలెట్ శిక్షణ కోసం.. ఇలాంటి కోర్సుకు దేశంలోనే మొదటిసారిగా ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుమతి సాధించింది.