తొలి ఏకాదశి సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్పకొండకు భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 70 వేల మంది భక్తులు కొండకు వచ్చినట్టు అధికారులు తెలిపారు. లడ్డు, అరిసె ప్రసాదాలను లక్ష మంది భక్తులకు అందేలా చర్యలు తీసుకున్నామని ఆలయ ఈఓ రామకోటిరెడ్డి తెలిపారు. ట్రాఫిక్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు పర్యవేక్షణ నిర్వహించారు. భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా నరసరావుపేట, చిలకలూరిపేట డిపోల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. భక్తులకు కొండ దిగువన పలు స్వచ్ఛంద సంస్థలు మంచినీరు, పులిహోర, దద్ధ్యోన్నం అల్పాహారాలను అందించాయి. ఆలయం వద్ద ఉన్న అన్నదాన సత్రంలో ఉచిత భోజన కార్యక్రమ నిర్వహించారు.
కోటప్పకొండకు పోటెత్తిన భక్తులు - guntur
రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన మహా పుణ్యక్షేత్రం కోటప్పకొండకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేలాది సంఖ్యలో భక్తులు త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
కోటప్పకొండ