ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"డ్రోన్ ప్రయోగం వైకాపా ప్రభుత్వం కుట్ర" - undefined

తెదేపా అధినేత చంద్రబాబు నివాసంపై డ్రోన్ ప్రయోగం రాష్ట్ర ప్రభుత్వ కుట్రేనని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఈ కుట్రలను త్వరలోనే ఎండగడతామని అన్నారు.

దేవినేని

By

Published : Aug 16, 2019, 3:31 PM IST

మీడియాతో దేవినేని

జగన్ ప్రభుత్వం ఆదేశాల మేరకే చంద్రబాబు నివాసంపై ప్రైవేట్ వ్యక్తులు డ్రోన్ ప్రయోగించారని దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. చంద్రబాబు ఇంటిలోకి వరద నీటిని పంపించాలని చూస్తున్నారని విమర్శించారు. ప్రజావేదికను కూల్చివేసి వైకాపా ప్రభుత్వం చేసిన తప్పును కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అలాగే రాజధానికి రైతులు ఇచ్చిన భూముల్లోకి వరద నీరు పంపించి... రాజధానిని కడప జిల్లా ఇడుపులపాయకు తీసుకెళ్లడానికి జగన్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ధ్వజమెత్తారు. డ్రోన్ ప్రయోగించిన వారిని వైకాపా ప్రభుత్వ ఆదేశాలతో కిరణ్ అనే వ్యక్తి నియమించారని ఉమా ఆరోపించారు. జడ్​ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన ప్రతిపక్షనేత ఇంట్లోకి ప్రైవేట్ వ్యక్తులు ఎలా వచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటిని వీడియో తీసి నక్సలైట్స్​కి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారా అని నిలదీశారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయటం... చంద్రబాబు ఇంటి వద్ద వరద నీరుని నిలబెట్టడం ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం కుట్రలని ఆరోపించారు. త్వరలోనే వీటిని ఎండగడతామని దేవినేని ఉమ ఉన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details