ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నల్లబెలూన్లతో నిరసన - ఏపీ రైల్వే జోన్

రాష్ట్రానికి రైల్వే జోన్ ప్రకటించి, ఆదాయం ఒడిశాకు వెళ్లేటట్టు ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారని తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. గుంటూరులో నల్లబెలూన్లను గాల్లోకి ఎగరేసి నిరసన తెలియజేశారు.

నల్లబెలూన్లతో నిరసన తెలుపుతున్న దేవినేని అవినాష్

By

Published : Feb 28, 2019, 3:40 PM IST

నల్లబెలూన్లతో నిరసన తెలుపుతున్న దేవినేని అవినాష్
రాష్ట్రానికిరైల్వే జోన్ ప్రకటించి, ఆదాయం రాకుండా ప్రధాని మోదీ అడ్డుకున్నారని తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. వాల్తేరు డివిజన్ రద్దు చేయటం, ఆదాయం వచ్చే భాగాన్ని రాయగఢకు కేటాయించటం వంటి అంశాలను రాజకీయ క్రీడగా చెప్పారు.మోదీ రాకను నిరసిస్తూ గుంటూరులో తెలుగు యువత చేపట్టిన నిరసన కార్యక్రమానికి అవినాష్ హాజరయ్యారు.ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నల్ల బెలూన్లు ఎగరేసి నిరసన తెలిపారు. రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతాయన్నారు.

ABOUT THE AUTHOR

...view details