ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరండల్​పేట అష్టలక్ష్మీ ఆలయంలో దేవీ నవరాత్రులు - అరుండల్ పేట తాజ వార్తలు

గుంటూరు జిల్లా అరండల్​పేట శ్రీ అష్టలక్ష్మీదేవి ఆలయంలో... దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ ఏడాది 25న వేడుకలు నిర్వహిస్తున్నామని ప్రధాన అర్చకులు తెలిపారు.

Devi Navratri  celebrations  at Ashtalakshmi Temple in Arundal Peta
అరుండల్ పేటలో అష్టలక్ష్మీ ఆలయంలో దేవి నవరాత్రులు

By

Published : Oct 17, 2020, 4:16 PM IST

గుంటూరులో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అరండల్​పేట శ్రీ అష్టలక్ష్మీదేవి ఆలయంలో.. మొదటి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ప్రతిమలను ప్రదర్శించారు. అష్టలక్ష్మి అమ్మవార్ల వివిధ రూపాలను భక్తుల సందర్శనార్థం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ ఏడాది 25న దేవీ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాద్ తెలిపారు. మూల నక్షత్రం రోజున ప్రత్యేక పూజలు జరుగుతాయని చెప్పారు. భక్తులు మాస్కులు, భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details