ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పథకాలు సద్వినియోగం చేసుకోవాలి: రఘుపతి - deputy speaker

గుంటూరు జిల్లా బాపట్లలో డిప్యూటీ స్పీకర్​ కోన రఘపతి పర్యటించారు. వ్యవసాయ మార్కెట్​ యార్డులో వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహించారు. వైఎస్​ రాజశేఖర​ రెడ్డి జయంతిలో ఆయన పాల్గొన్నారు.

'ప్రజలకు సేవ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది'

By

Published : Jul 8, 2019, 11:27 PM IST

గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆధ్వర్యంలో వైఎస్​ రాజశేఖర​ రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఆరో వార్డులో 'వైఎస్సార్ భరోసా' పేరుతో గత ప్రభుత్వం ఇస్తున్న రెండు వేల రూపాయలను పెంచి 2,250 రూపాయలు లబ్ధిదారులకు అందజేశారు. బాపట్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతు దినోత్సవం సందర్భంగా పశుసంవర్ధక శాఖ, ఉద్యానవన శాఖ, మత్స్యశాఖ, జౌళి శాఖ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమంలో చిన్నారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పాల్గొని వైఎస్సార్ పుట్టినరోజు సందర్భంగా మహిళలతో కలిసి కేకును కట్ చేశారు. వ్యవసాయ శాఖకు చెందిన గోడపత్రికలను ఆవిష్కరించారు. జడ్పీ సీఈవో వ్యవసాయ శాఖ కోన రఘుపతిని సన్మానించారు. ప్రజలు ఎంతో నమ్మకంతో 151 సీట్లను వైయస్సార్సీపి పార్టీకి అందించారని... వారికి సేవ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తెలిపారు. బాపట్ల నియోజకవర్గంలో 158 కోట్ల రూపాయలు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ జరిగిందని తెలియజేశారు.

'ప్రజలకు సేవ చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది'

ABOUT THE AUTHOR

...view details