బాపట్ల కేంద్రంగా జిల్లా ఏర్పడుతుందని శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో గురువారం ఏర్పాటుచేసిన పౌర సన్మాన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, ఉపసభాపతి కోన రఘుపతి, శాసన మండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కోన రఘుపతి మాట్లాడుతూ బాపట్ల పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ముఖ్యంగా మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడతామని పేర్కొన్నారు. తన తండ్రి కోన ప్రభాకరరావు మూడు పర్యాయాలు బాపట్ల శాసనసభ్యుడిగా పనిచేశారని..బాపట్ల అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు. బాపట్లను నల్లమడ జిల్లాగా మార్చాలని తన తండ్రి ఎంతో కాలం ప్రయత్నించారన్న ఉపసభాపతి..ఆ కోరిక ఇప్పుడు నెరవేరుతుందన్నారు. జిల్లా కేంద్రంగా బాపట్లను అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని కోన తెలియజేశారు.
నా తండ్రి కల సాకారం అవుతుంది : ఉపసభాపతి కోన రఘుపతి - కోన రఘుపతి
కొత్త జిల్లాల ఏర్పాటులో బాపట్ల కేంద్రంగా జిల్లా ఏర్పడుతుందని శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి అభిప్రాయపడ్డారు. గురువారం పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బాపట్లను అభివృద్ధి పథంలో నడిపించడానికి కృషి చేస్తానన్నారు.
నా తండ్రి కల సాకారం అవుతుంది : ఉపసభాపతి కోన రఘుపతి