రాష్ట్రంలో ఇళ్ల స్థలాల కోసం లక్షలాది మంది పేదలు పడుతున్న ఇబ్బందుల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీర్చారని... ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇళ్ల స్థలాలు పొందాలంటే గతంలో డబ్బులు ఇవ్వాల్సి వచ్చేదనీ... ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వచ్చేదని అన్నారు. ఇప్పుడు వాలంటీర్లే ఇళ్లకు వెళ్లి అన్ని వివరాలు నమోదు చేసుకొని.. ఇంటి స్థలాన్ని సరిహద్దులతో సహా చూపిస్తున్నారన్నారు. ఇటువంటి నిర్ణయాలు అందరు ముఖ్యమంత్రులు తీసుకోలేరన్నారు.
ఇటువంటి నిర్ణయాలు అందరు ముఖ్యమంత్రులు తీసుకోలేరు: ఉపసభాపతి - deputy speaker kona raghupathi news
గుంటూరు జిల్లా బాపట్లలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అర్హులైన పేదలకు ఉపసభాపతి కోన రఘుపతి ఇళ్ల పట్టాలను అందజేశారు.
బాపట్లలో ఇళ్ల పట్టాల పంపిణీ