మూడు రాజధానుల నిర్మాణానికి ప్రజా మద్దతు ఉందని ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. గుంటూరు జిల్లా బాపట్లలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన..రాజధాని నిర్మాణంలో గత తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అమరావతి రైతులకు వారి వాదన చెప్పుకునే హక్కుందన్నారు. అదే సమయంలో పాదయాత్రలో ఎలాంటి వివాదాలు రాకుండా చూసుకోవాలన్నారు. మూడు రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.
Deputy Speaker: అమరావతి రైతులకు వారి వాదన చెప్పుకునే హక్కు ఉంది: కోన రఘుపతి - అమరావతిపై కోన రఘుపతి కామెంట్స్
మూడు రాజధానులతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఉపసభాపతి కోన రఘుపతి అన్నారు. రాజధాని నిర్మాణంలో గత తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
అమరావతి రైతులకు వారి వాదన చెప్పుకునే హక్కు ఉంది
అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కోన..రూ.2,800 కోట్లతో రహదారులు, మౌలిక వసతులను అభివృద్ధి చేస్తోందన్నారు. అమరావతిలో శాసనసభ హైకోర్టు ఉంటాయని స్పష్టం చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ మాత్రమే ఏర్పాటవుతుందన్నారు. విశాఖలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు అవుతుందన్నారు.
ఇదీ చదవండి: Amaravathi Protest: ప్రభంజనంలా అమరావతి రైతుల మహా పాదయాత్ర..అడుగడుగునా జన నీరాజనం