వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి అర్హులైన ఆటో, టాక్సీ, మాక్సీక్యాబ్, ట్రాక్టర్ ,యెల్లో బోర్డ్ ఉన్న ఓనర్ ,డ్రైవర్లు దరఖాస్తు చేసుకోవాలని రవాణా శాఖ ఉపకమిషనర్ మీరా ప్రసాద్ అన్నారు. గత సంవత్సరం వైఎస్సార్ వాహన మిత్ర పథకంలో లబ్ధి పొందిన లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు. కానీ ఆడిట్ కొరకు డాక్యుమెంట్స్ అందజేయలన్నారు. జిల్లా వ్యాప్తంగా 20954 మందికి అర్హత పొందినట్లుగా ఆయన వెల్లడించారు. నూతనంగా పథకంలో నమోదు చేసుకునే వారు సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన వారి వివరాలను సచివాలయంలో ఉంటాయన్నారు. ఇంకా ఎవరైనా వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి అర్హత కలిగి ఉండే అప్లై చేసుకోవాలని మీరా ప్రసాద్ వివరించారు.
' వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి దరఖాస్తు చేసుకోండి' - ఏపీలో వైఎస్సార్ వాహన మిత్ర
వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి అర్హులైన ఆటో, టాక్సీ, మాక్సీక్యాబ్, ట్రాక్టర్ ,యెల్లో బోర్డ్ ఉన్న ఓనర్, డ్రైవర్లు దరఖాస్తు చేసుకోవాలని రవాణా శాఖ ఉపకమిషనర్ మీరా ప్రసాద్ అన్నారు. నూతనంగా పథకంలో నమోదు చేసుకునే వారు సంబంధిత పత్రాలతో అప్లై చేసుకోవాలన్నారు.
వైఎస్సార్ వాహన మిత్ర