ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ భూమి విశ్రాంత సైనికుడు నంది భీమప్పదే: జల రవాణా శాఖ - latest news on land issues in Guntur

గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో ఆక్రమణకు గురైన భూమి విశ్రాంత సైనికుడు నంది భీమప్పదే అని జల రవాణా శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు బోర్డు ఏర్పాటు చేశారు. తన భూమి అక్రమణకు గురైందని బాధితుడి కుటుంబసభ్యులు, మాజీ సైనికులు ఆందోళన చేపట్టగా అధికారులు స్పందించారు.

land issues in Guntur
ఆ భూమి విశ్రాంత సైనికుడు నంది భీమప్పదే: జలరవాణా శాఖ

By

Published : Jan 12, 2021, 1:00 AM IST

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరులో విశ్రాంత సైనికుడు నంది భీమప్పకు కేటాయించిన స్థలంపై జల రవాణా శాఖ అధికారులు స్పందించారు. ఆ భూమి భీమప్పకు చెందినదేనని స్పష్టం చేశారు. ఈ మేరకు అంతకుముందున్న బోర్డును తీసేవేసి దాని స్థానంలో మరొక బోర్డును ఏర్పాటు చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన ఎకరా 83సెంట్ల భూమి అక్రమణకు గురైందని సైనికుడి కుటుంబసభ్యులు, మాజీ సైనికులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో దిగివచ్చిన జల రవాణా శాఖ అధికారులు.. తప్పును సరిదిద్దుకున్నారు. దీంతో సైనికుడి కుటుంబసభ్యులు, మాజీ సైనికులు హర్షం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details