ఉపాధ్యాయుల బదిలీలు, సర్దుబాటు, పదోన్నతుల షెడ్యూల్, సూచనలు అనుసరించి గుంటూరు జిల్లాలో ప్రతి మండలంలో పాఠశాలల వారీగా వివరాల నివేదికలు తమ కార్యాలయానికి పంపాలని.. డీఈవో ఆర్.ఎస్.గంగాభవాని ఉపవిద్యాశాఖాధికారులు, మండల విద్యాధికారులను ఆదేశించారు. అన్ని రకాల ఖాళీలను, తప్పనిసరిగా బదిలీ అయ్యే ఉపాధ్యాయుల వివరాలు సేకరించాలని కోరారు. పోస్టుల సర్దుబాటుకు 2020 ఫిబ్రవరి 29 నాటి విద్యార్థుల సంఖ్య ప్రామాణికంగా తీసుకోవాలన్నారు. అక్టోబరు 14వ తేదీ నాటికి విద్యార్థుల సంఖ్యలో పెరుగుదల ఉంటే సంబంధిత ప్రధానోపాధ్యాయులు వారి తనిఖీ అధికారుల ద్వారా వివరాలు డీఈవో కార్యాలయాలకు అక్టోబరు 19వ తేదీ లోపుగా సమర్పించాలని సూచించారు.
పాఠశాలల వారీగా వివరాలు పంపాలి: డీఈవో - గుంటూరు డీఈవో గంగాభవాని వార్తలు
జిల్లాలోని ప్రతి మండలంలో పాఠశాలల వారీగా వివరాలను తన కార్యాలయానికి పంపాలని గుంటూరు జిల్లా డీఈవో ఆర్.ఎస్. గంగాభవాని విద్యాధికారులను ఆదేశించారు. అన్ని రకాల ఖాళీలను, తప్పనిసరిగా బదిలీ అయ్యే ఉపాధ్యాయుల వివరాలు సేకరించాలని కోరారు.
పాఠశాలల వివరాలు