ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫిరంగిపురంలో స్వాగత ద్వారం కూల్చివేత - గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో స్వాగతద్వారం కూల్చివేత

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం నుదురుపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఆర్చిని అధికార పార్టీకి చెందిన నాయకులు ఉద్దేశపూర్వకంగా పడగొట్టడం కలకలం రేపింది. ఘటనపై తేదేపా శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిరంగిపురం: తెదేపా హయాంలో నిర్మించిన స్వాగత ద్వారం కూల్చివేత
ఫిరంగిపురం: తెదేపా హయాంలో నిర్మించిన స్వాగత ద్వారం కూల్చివేత

By

Published : Nov 30, 2020, 5:09 PM IST

తెదేపా హయాంలో నిర్మించిన స్వాగత ద్వారాన్ని వైకాపా శ్రేణులు పడగొట్టడం గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. ఫిరంగిపురం మండలం నుదురుపాడులో గతంలో సీసీ రహదారి నిర్మించిన సందర్భంగా స్వాగత ద్వారం ఏర్పాటు చేశారు. అయితే కొంతమంది ప్రొక్లెయిన్‌తో ఆ నిర్మాణాన్ని కూలదోశారు. వైకాపాకు చెందిన వ్యక్తులు కావాలనే నిర్మాణాన్ని పడగొట్టారని తెదేపా శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకూ సిద్ధమయ్యారు. అయితే సమీపంలో రైతు భరోసా కేంద్రం నిర్మాణం జరుగుతున్నందున రాకపోకలకు అడ్డు వస్తుందనే తొలగించామని వైకాపా నేతలు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details