ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాతా శిశు కేంద్రం కూల్చివేత దారుణం: ధూళిపాళ్ల నరేంద్ర - tdp leader dhulipalla narendra kumar news

గుంటూరు జిల్లా చేబ్రోలులో మాతా శిశు కేంద్రాన్ని అధికారులు శుక్రవారం కూల్చివేశారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ధ్వజమెత్తారు. పంచాయతీ నిధులు 8 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ కేంద్రాన్ని అధికారులు బాధ్యతారాహిత్యంగా కూల్చివేయడం దారుణమన్నారు.

dhulipalla narendra kumar
dhulipalla narendra kumar

By

Published : Nov 7, 2020, 9:33 PM IST

గుంటూరు జిల్లా చేబ్రోలులో మాతా శిశు కేంద్రాన్ని అధికారులు కూల్చి వేయటంపై పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మండిపడ్డారు. పంచాయతీ నిధులు 8 లక్షల రూపాయలతో నిర్మించిన ఈ కేంద్రాన్ని అధికారులు బాధ్యతారాహిత్యంగా కూల్చివేయడం దారుణమన్నారు. ధ్వంసమైన భవనాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ప్రతి నెలా మండలంలోని అన్ని అంగన్​వాడీ కేంద్రాల ఉపాధ్యాయులు, ఆయాలు ఈ భవనంలోనే సమావేశాలు నిర్వహించుకునేవారని నరేంద్ర కుమార్ గుర్తు చేశారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details