గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని సురేష్ మహల్ రోడ్డులో అక్రమ నిర్మాణాలను మున్సిపల్ శాఖ అధికారులు కూల్చివేశారు. 15 రోజుల క్రితం ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చినప్పటికీ.. ఎలాంటి స్పందన లేని కారణంగా... భారీ పోలీసు బందోబస్తు మధ్య 112 మంది అక్రమ నిర్మాణాలను తొలగించారు. కనీసం సామాన్లు తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల తర్వాత కూల్చివేయాలని కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వినుకొండలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత - Vinukonda latest news
గుంటూరు జిల్లాలో మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణాలును కూల్చివేశారు. బందోబస్తు మధ్య 112 మంది నిర్మాణాలను తొలగించారు. కనీసం సామాన్లు తీసుకోవడానికి కూడా సమయం ఇవ్వలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వినుకొండలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత