గుంటూరులో ఉద్రిక్తతకు దారి తీసిన.. అక్రమ కట్టడాల కూల్చివేత - గుంటూరులో ఉద్రిక్తత
08:45 July 30
గుంటూరులో ఉద్రిక్తత
గుంటూరులోని వెళాంగిణి నగర్లో అక్రమ కట్టడాల కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసుల సాయంతో మున్సిపల్ అధికారులు ఇళ్లు తొలగిస్తున్నారు. దీంతో స్థానికులు పోలీసులు, అధికారులతో వాగ్వాదానికి దిగారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారని ప్రశ్నించారు. కోర్టు తీర్పు ప్రకారమే కూల్చివేతలు చేపట్టినట్లు పోలీసులు, అధికారులు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధుల తీరుపై స్థానిక మహిళలు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు.
ఇదీ చూడండి. high court: 'ఆగస్టు 5లోగా కౌంటర్ వేయండి'