కరోనా మృత దేహాల తరలింపు, అంతిమ సంస్కారాల విషయంలో బాధిత కుటుంబ సభ్యులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. అసలే అయిన వారిని పోగొట్టుకున్న ఆవేదనలో ఉండగా.. అంత్యక్రియల కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సివస్తోంది. ఆసుపత్రి నుంచి అంతిమ యాత్ర వరకూ ప్రతిచోటా అడిగినంత సొమ్ము చెల్లించలేకపోతున్నారు. బంధువులు సైతం అంత్యక్రియలకు దూరంగా ఉంటున్న సమయంలో కుటుంబ సభ్యులే ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని తరలించి కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలో అడుగడుగునా వేలకు వేల రూపాయలు చెల్లించుకోవాల్సి రావటం భారంగా మారుతోంది.
- అడుగడుగునా డబ్బులు
తెనాలికి చెందిన ఓ మహిళ ఈనెల 14న గుంటూరు జీజీహెచ్‌లో మరణించారు. ఆమె మృత దేహాన్ని గుంటూరులోని స్థంబాల గరువు శ్మశాన వాటికకు తీసుకెళ్లేందుకు అంబులెన్స్ నిర్వాహకులు 30వేలు డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేక వారు అమ్మ ఛారిటబుల్ ట్రస్టు సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. గుంటూరు నగరానికి చెందిన మరో కుటుంబం జీజీహెచ్ నుంచి సంగడిగుంట శ్మశాన వాటికకు తీసుకెళ్లటానికి అంబులెన్స్‌కు 20వేలు చెల్లించారు. ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో మరణించిన ఓ వ్యక్తి మృత దేహాన్ని గుంటూరులోని శ్మశాన వాటికకు తీసుకురావటానికి ఏకంగా రూ.50 వేలు డిమాండ్ చేశారు.
- కాసుల కోసం