ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్ - గుంటూరు జిల్లా ముఖ్యవార్తలు

శీతల పానీయంలో మత్తు మందు కలిపి మైనర్ బాలికను అత్యాచారం చేసిన నిందితుడిని బాపట్ల పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ
వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ

By

Published : May 24, 2021, 7:30 PM IST

వివరాలను వెల్లడిస్తున్న డీఎస్పీ

గుంటూరు జిల్లాలో మైనర్ బాలికకు శీతల పానీయంలో మత్తు మందు కలిసి అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేసు వివరాలను డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. పొన్నూరు పట్టణంలో నిమ్మకాయల హరికృష్ణ అనే ఓ సూపర్​ మార్కెట్ నిర్వాహకుడు... తన వద్ద పనిచేస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థినిని శీతల పానీయంలో మత్తు మందు కలిపి అత్యాచారం చేశాడు.

ఈ నెల 18న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సోమవారం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నిందితుడిపై ఫోక్సో, రేప్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇటువంటి ఘటనలు జరిగితే ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలని కోరారు. ఈ సమావేశంలో పొన్నూరు అర్బన్, రూరల్ సీఐలు శరత్, శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 12,994 కరోనా కేసులు, 96 మరణాలు

ABOUT THE AUTHOR

...view details