కోడెల శివప్రసాదరావు మృతితో ఆయన స్వగ్రామమైన గుంటూరు జిల్లా నకరికల్లు మండలం కండ్లకుంటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కండ్లకుంటలో ఆయన పుట్టి పెరిగిన ఇల్లు ఇప్పటికీ అలాగే ఉంది. ప్రస్తుతం ఆ ఇంట్లో కోడెల బంధువులు నివసిస్తున్నారు. కోడెల రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా స్థానిక పాఠశాల అభివృద్ధికి తోడ్పడ్డారు. కొత్త భవనాలు నిర్మించారు. అయినా తాను చదువుకున్న తరగతి గదిని మాత్రం తన జ్ఞాపకంగా అలాగే ఉంచారు. ఇప్పటికీ పెంకులతో కూడిన ఆ భవనం ఆలాగే ఉంది. కోడెల మృతితో ఆ గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. ఆయన మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన తమ ఊరికి చేసిన సేవలను మననం చేసుకుంటున్నారు.
కోడెల స్వగ్రామం కండ్లకుంటలో విషాదఛాయలు - kandlakunta
మాజీ స్పీకర్ కోడెల మరణంతో ఆయన స్వగ్రామం కండ్లకుంటలో విషాదం ఛాయలు అలుముకున్నాయి. ఆయన గ్రామానికి చేసిన సేవలను స్మరించుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. తమ గ్రామానికి పెద్ద దిక్కుగా ఉన్న నాయకుడు మరణించడాన్ని వాళ్లు జీర్జించుకోలేకపోతున్నారు. కోడెల లేని లోటు తీరనిదని ఆవేదన వ్యక్తం చేశారు.
కోడెల స్వగ్రామం కండ్లకుంటలో విషాదచాయలు