ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పరీక్షలకు అనుమతించకుంటే ఉరితాడే మాకు శరణ్యం' - పరీక్షలకు అనుమతించకుంటే ఉరితాడే మాకు శరణ్యం

పరీక్షలకు అనుమతివ్వకపోతే ఉరితాడే మాకు శరణ్యమంటూ... విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. యాజమాన్య కోట డీఈడీ-2018 బ్యాచ్ విద్యార్థులను పరీక్షలకు అనుమతించాలని కోరుతూ ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు.

ded students protest at guntur
పరీక్షలకు అనుమతించకుంటే ఉరితాడే మాకు శరణ్యం

By

Published : Nov 1, 2020, 9:32 PM IST

యాజమాన్య, స్పాట్‌ అడ్మిషన్‌ ద్వారా ప్రవేశం పొందిన తమను పరీక్షలు రాసేందుకు అనుమతించాలని డీఈడీ-2018 బ్యాచ్ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. రెండేళ్లుగా విద్యనభ్యసిస్తున్న తమను ఇప్పుడు పరీక్ష రాసేందుకు అనుమతించకపోడం సరికాదని... దీనిపై ప్రభుత్వం స్పందించి పరీక్ష రాసేందుకు మాకు అనుమతించాలని కోరారు. లేనిపక్షంలో తమకు ఉరితాడే శరణ్యమంటూ... కర్రకు తాడు కట్టి ఉరి వేసుకుంటామని విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details