గుంటూరు జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని కలెక్టర్ శ్యాముల్ ఆనంద్ తెలిపారు. గుంటూరు కలెక్టరేట్లో... ఎస్పీలు రామకృష్ణ, విజయారావుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన పాలనాధికారి... రెడ్ జోన్లో ఉన్న గుంటూరులో ఎలాంటి మినహాయింపులు ఉండబోవని స్పష్టం చేశారు. 21 రోజులపాటు కొత్త కేసులు రాకపోతే కంటైన్మెంట్ జోన్ నుంచి మినహాయింపు ఇస్తామని చెప్పారు. గుంటూరు అర్బన్ పరిధిలో 6 రోజుల్లో 720 పరీక్షలు చేశామని... వీటిలో 7 మాత్రమే పాజిటివ్ వచ్చాయని వివరించారు. అవీ కూడా కంటైన్మెంట్ జోన్లోనే నమోదవుతున్నాయని చెప్పారు.
గుంటూరు జిల్లాలో తగ్గుతున్న కరోనా కేసులు - decresing corona cases in guntur
గుంటూరు జిల్లాలో కరోనా కేసులు అదుపులోకి వస్తున్నాయని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ చెప్పారు. ఇప్పటికే కంటైన్మెంట్ జోన్లలో కాంటాక్టు కేసులను గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నామన్న కలెక్టర్.. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు వైరస్ నిర్థారణ పరీక్షలు చేస్తున్నామని చెప్పారు.
decreasing corona cases in guntur DST said by collector