వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు... కరోనా మహమ్మారి కారణంగా సందడి లేకుండా జరుగుతున్నాయి. అయినా.. నిర్వాహకులు మాత్రం తమ వంతుగా సందడి చేస్తున్నారు. గుంటూరు ఏటుకూరు రోడ్డులోని వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో గణనాధుడిని 10 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. నవరాత్రులను గత 22 సంవత్సరాలుగా అట్టహాసంగా నిర్వహిస్తున్నట్టు కమిటీ అధ్యక్షుడు నాగేశ్వరరావు తెలిపారు.
రూ. 10 లక్షల విలువైన నోట్లతో వినాయకుడికి అలంకరణ - guntur news
గుంటూరు ఏటుకూరు రోడ్డులోని శ్రీకన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద వాసవీ యూత్ ఆధ్వర్యంలో గణనాథుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చవితి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వాహకులు రూ.10 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో లక్ష్మీగణపతిని అలంకరించారు.
10 లక్షల కరెన్సీ నోట్లతో వినాయకునికి అలంకరణ