అమరావతినే రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్‌తో ఉద్యమం మెుదలై..125 రోజులైన సందర్భంగా గుంటూరులో ఐకాస నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. రాజకీయేతర ఐకాస ఆధ్వర్యంలో 'జై అమరావతి 125' అనే అక్షరాలతో దీపాలు వెలిగించారు. గొట్టిపాటి కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రైతులు భౌతికదూరం పాటిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతోనే జగన్ రాజధానిని తరలిస్తున్నారని ఐకాస నాయకురాలు డాక్టర్ శైలజ ఆరోపించారు. 125 రోజులుగా తామ చేసున్న పోరాటాన్ని ప్రభుత్వం గౌరవించాలన్నారు. లాక్డౌన్ ముగిసిన తర్వాత తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల గురించి కాకుండా ప్రజల ఆరోగ్యం గురించి సీఎం ఆలోచించాలని శైలజ విమర్శించారు.
'చంద్రబాబుపై కక్షతోనే రాజధాని మార్పు నిర్ణయం' - అమరాతవి ఆందోళనలు
రాజధానిగా అమరావతినే కొనసాగించాలని కోరుతూ.. గుంటూరులో ఐకాస నేతలు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఉద్యమం మెుదలై 125 రోజులు గడుస్తున్న సందర్భంగా 'జై అమరావతి' అక్షరాలతో దీపాలు వెలిగించి ఆందోళన చేపట్టారు. చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతోనే జగన్ రాజధానిని తరలిస్తున్నారని ఐకాసా నాయకురాలు డాక్టర్ శైలజ ఆరోపించారు.
!['చంద్రబాబుపై కక్షతోనే రాజధాని మార్పు నిర్ణయం' చంద్రబాబుపై కక్షతోనే రాజధాని మార్పు నిర్ణయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6874855-312-6874855-1587418446807.jpg)
చంద్రబాబుపై కక్షతోనే రాజధాని మార్పు నిర్ణయం