కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలను అభినందిస్తూ ..గుంటూరులో దేచిరాజు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారికి శానిటైజర్లు, మాస్కులు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. పట్టణంలో లక్ష్మీ థియేటర్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భాజపా జిల్లా అధ్యక్షుడు పాటిబండ్ల రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరోనా కష్ట కాలంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనాను నివారించడంలో పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలు వెలకట్టలేనివని నాయకులు కొనియాడారు.
'కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమోఘం' - గుంటూరు వార్తలు
గుంటూరులో పారిశుద్ధ్య కార్మికులకు దేచిరాజు ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు చీరలు, మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. కరోనా సమయంలో వీరు చేసిన సేవలు అమోఘమని జిల్లా భాజపా నేతలు అన్నారు.
గుంటూరులో పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ