రాష్ట్ర రైతులపై ఏటా పెరుగుతున్న రుణభారం..
Agricultural debt burden in southern states: రాష్ట్ర రైతులపై ఏటా రుణభారం పెరుగుతోందని కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొంది. లోక్‌సభలో ఓ సభ్యుడు రైతుల అప్పులపై అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా బదులిచ్చింది. తమిళనాడు తర్వాత అత్యధిక వ్యవసాయ రుణ భారం ఆంధ్రప్రదేశ్ రైతుల పైనే ఉందని కేంద్రం ఇచ్చిన లెక్కలతో వెల్లడైంది.
Agricultural debt burden in southern states: రాష్ట్ర రైతులపై ఏటా రుణభారం పెరుగుతోందని కేంద్ర వ్యవసాయ శాఖ పేర్కొంది. రాష్ట్ర రైతులపై ఈ ఏడాది మార్చి 30 నాటికి లక్షా 91 వేల 970 కోట్ల రూపాయల రుణ భారం ఉంది. కోటి 34 లక్షల 5 వేల 372 ఖాతాల ద్వారా రైతులు ఈ రుణాలు తీసుకున్నట్లు పార్లమెంటుకు వెల్లడించింది. లోక్‌సభలో ఓ సభ్యుడు.. రైతుల అప్పులపై అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా బదులిచ్చింది. తమిళనాడు తర్వాత అత్యధిక వ్యవసాయ రుణ భారం ఆంధ్రప్రదేశ్ రైతుల పైనే ఉందని కేంద్రం ఇచ్చిన లెక్కలతో వెల్లడైంది. ఈ ఏడాది మార్చి నాటికి దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు బ్యాంకులు 17.09లక్షల కోట్ల రూపాయల రుణాలు మంజూరు చేయగా... అందులో 46.20 శాతం రుణాలు దక్షిణాది రైతులే తీసుకున్నారని పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాల్లో అతి తక్కువ వ్యవసాయ రుణ భారం తెలంగాణ రైతులపై ఉన్నట్లు కేంద్రం ఇచ్చిన వివరాల్లో తేలింది. 2020తో పోలిస్తే 2022 నాటికి ఏపీలో వ్యవసాయ రుణ భారం 40.35 శాతం పెరగగా.... తెలంగాణలో 30.22 శాతం వృద్ధి కనిపించింది.