ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బతికుండగానే చంపేశారు... జీజీహెచ్‌ వైద్యుల నిర్లక్ష్యం - undefined

గుంటూరు జీజీహెచ్ వైద్యుల నిర్వాకం మరోసారి బయటపడింది. బతికుండగానే ఓ వ్యక్తికి చావును నిర్దరిస్తూ  ధ్రువపత్రాన్ని అందించారు. ఆదినారాయరెడ్డి అనే వ్యక్తి ఈ నెల అస్వస్థతతో జీజీహెచ్ చేరారు. అదే రోజు చనిపోయినట్లు ధ్రువీకరించిన వైద్యులు..బంధువుల ఆందోళనతో వైద్యం ప్రారంభించారు. నిజంగానే ఆదినారాయణరెడ్డి చనిపోవటంతో మరోసారి డెత్ సర్టిఫికేట్ జారీ చేయటం కలకలం రేపుతోంది.

బతికుండగానే చంపేశారు... జీజీహెచ్‌ వైద్యుల నిర్లక్ష్యం

By

Published : Apr 24, 2019, 8:43 AM IST

Updated : Apr 24, 2019, 10:33 AM IST

బతికుండగానే చంపేశారు... జీజీహెచ్‌ వైద్యుల నిర్లక్ష్యం

గుంటూరు జీజీహెచ్ వైద్యుల నిర్వాకం మరోసారి బయటపడింది. బతికుండగానే ఓ వ్యక్తికి చావును నిర్దరిస్తూ ధ్రువపత్రాన్ని అందించారు ఇక్కడి వైద్యులు. ఆదినారాయణ ఆనే రోగికి రెండుసార్లు మరణ ధ్రువీకరణ రశీదు జారీ చేశారు. సున్నం పని చేసుకుంటూ పెద్ద పలకలూరుకు చెందిన ఆదినారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఈ నెల 20న జీజీహెచ్‌లో చేరారు. అదేరోజు రాత్రి ఆదినారాయణ మృతి చెందినట్లు రశీదు ఇచ్చారు వైద్యులు. ప్రాణం ఉందని బంధువులు నిలదీసేసరికి మళ్లీ చికిత్స అందించారు. రెండ్రోజుల తర్వాత ఈ నెల 22న నిజంగానే ఆదినారాయణ మృతి చెందారు. అప్పుడో సర్టిఫికేట్ అందించారు. వైద్యులు రెండు రోజుల వ్యవధిలోనే రెండుసార్లు డెత్ సర్టిఫికేట్ ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారు. నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై జీజీహెచ్ అధికారులు విచారణ జరుపుతున్నారు.

Last Updated : Apr 24, 2019, 10:33 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details