గుంటూరు జిల్లా గంగిరెడ్డిపాలెంలో ఓ జింకను కుక్కలు వేటాడి చంపాయి. ఓ జింక నీటి కోసం అటవీ ప్రాంతం నుంచి ఊర్లోకి వచ్చింది. జింకను చూసిన కుక్కలు వెంటాడి.. వేటాడి చంపాయని గ్రామస్థులు తెలిపారు. అటవీ ప్రాంతంలో లోతైన కాలువల వల్ల కొంతమందికి వేట సులువైందని...అధికారులు మాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. అడవుల్లో వన్యప్రాణులకు నీటి గుంతలు తీయకపోవటం వల్ల మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు జంతువులను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
వీధి కుక్కల దాడి... జింక మృతి - గంగిరెడ్డి పాలెం వీధి కుక్కల దాడిలో జింక మృతి
నీటి ఎద్దడి మూగ జీవాల ప్రాణాలను బలిగొంటోంది. నీటి కోసం జనావాసాల్లోకి వచ్చిన జింకను వీధి కుక్కలు వేటాడి చంపిన ఘటన గుంటూరు జిల్లా గంగిరెడ్డి పాలెంలో జరిగింది.
![వీధి కుక్కల దాడి... జింక మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3147749-292-3147749-1556616713274.jpg)
గంగిరెడ్డి పాలెం వీధి కుక్కల దాడిలో జింక మృతి
TAGGED:
జింక మృతి