ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

20 గంటలు మృతదేహంతో గడిపిన కరోనా బాధితులు

తెనాలిలో వైద్యాధికారుల నిర్లక్ష్యం బయటపడింది. కొవిడ్ వార్డులో కరోనాతో ఓ మహిళ మృతి చెందితే మృతదేహాన్ని శవాగారానికి తరలించేందుకు 20గంటల సమయం పట్టింది. దీనివల్ల ఆ వార్డులోని కరోనా బాధితులు బిక్కుబిక్కుమంటూ గడిపారు.

tenali hosiptal
tenali hosiptal

By

Published : Aug 1, 2020, 11:01 PM IST

మృతదేహాన్ని తరలిస్తున్న మున్సిపల్ సిబ్బంది

గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనాతో మరణించిన రోగి మృతదేహం తరలించేందుకు 20 గంటల సమయం పట్టింది. ఆసుపత్రి సిబ్బంది మృతదేహం తరలించేందుకు అంగీకరించకపోవటంతో... చివరకు మున్సిపల్ సిబ్బందిని పిలిపించి శవాగారం చేర్చాల్సి వచ్చింది.

కరోనాతో కొద్ది రోజుల క్రితం ఆసుపత్రిలో చేరిన మహిళా రోగి.. శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందింది. మృతదేహం తీసుకెళ్లేందుకు బంధువులు ఎవరూ రాలేదు. దీంతో మృతదేహాన్ని కనీసం శవాగారానికి కూడా తరలించకుండా అలాగే ఉంచారు వైద్య సిబ్బంది. వార్డులోని మిగతా రోగులు శుక్రవారం రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ విషయం మీడియాలో ప్రసారం కావటంతో ఉన్నతాధికారులు స్పందించారు. మున్సిపల్ అధికారులకు చెప్పి సిబ్బందిని పంపాలని కోరారు. చివరికి శనివారం ఉదయం 10గంటల సమయంలో మున్సిపల్ సిబ్బంది ఆసుపత్రికి వచ్చి మృతదేహాన్ని శవాగారానికి తీసుకెళ్లారు. పీపీఈ కిట్లు ధరించి ఈ కార్యక్రమం పూర్తి చేశారు. అప్పటి వరకూ మిగతా రోగులు భయంభయంగా గడిపారు.

తెనాలి ఆసుపత్రిని కొవిడ్ ఆసుపత్రిగా మార్చిన తర్వాత సిబ్బంది నియామకం పూర్తిగా జరగలేదు. నాలుగో తరగతి ఉద్యోగులు లేకపోవటంతో కొవిడ్​తో మరణించిన వారి మృతదేహాలు శవాగారం తరలించే వారే లేరు.

ఇదీ చదవండి

రాష్ట్రంలో లక్షా 50 వేలు దాటిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details