ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

స్వగ్రామానికి జవాన్ జశ్వంత్ రెడ్డి మృతదేహం.. నేడు అంత్యక్రియలు

దేశ సరిహద్దులో జరిగిన ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ జశ్వంత్ రెడ్డి మృతదేహం బాపట్లకు చేరుకుంది. ప్రత్యేక వాహనంలో మద్రాస్ రెజిమెంట్ సైనికులు మృతదేహాన్ని తీసుకొచ్చారు. నేడు కొత్తపాలెంలో జశ్వంత్ రెడ్డి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

dead body of Jawan Jashwant Reddy
జవాన్ జశ్వంత్ రెడ్డి

By

Published : Jul 10, 2021, 1:13 AM IST

Updated : Jul 10, 2021, 6:11 AM IST

జమ్మూ సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ జశ్వంత్ రెడ్డి మృతదేహాం బాపట్లకు చేరుకుంది. ప్రత్యేక వాహనంలో మద్రాస్ రెజిమెంట్ సైనికులు మృతదేహాన్ని తీసుకొచ్చారు. జశ్వంత్ రెడ్డి మృతదేహానికి ఉప సభాపతి కోన రఘుపతి నివాళులర్పించారు. బాపట్ల నుంచి కొత్తపాలెం వరకు మాజీ సైనికుల ఆధ్వర్యంలో ఊరేగింపు మధ్య మృతదేహాన్ని తరలించారు. నేడు కొత్తపాలెంలో జశ్వంత్ రెడ్డి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియల్లో హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొననున్నారు.

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో జరిగిన ఉగ్రదాడి కాల్పుల్లో.. బాపట్ల మండలం దరివాద కొత్తపాలెంకు చెందిన మారుప్రోలు జశ్వంత్ రెడ్డి మరణించారు. కొత్తపాలెం గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ కుమారుడు జశ్వంత్​ రెడ్డి. మరికొద్ది రోజుల్లో జశ్వంత్​ రెడ్డికి వివాహం చేయాలని భావిస్తున్నలోపే ఉగ్రదాడిలో మరణించాడంటూ.. తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

జశ్వంత్ రెడ్డి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 17 మద్రాస్ రెజ్మెంట్ లో 2016 లో సైనికునిగా జశ్వంత్.. శిక్షణ తర్వాత నీలగిరిలో మొదటగా విధులు నిర్వహించారు. అనంతరం జమ్మూకశ్మీర్‌కు వెళ్లారు. అక్కడే విధులు నిర్వహిస్తూ వీరమరణం పొందారు.

ఇదీ చదవండి:

Flash: ఏడేళ్ల చిన్నారి దారుణ హత్య..ముళ్లపొదల్లో మృతదేహం

Last Updated : Jul 10, 2021, 6:11 AM IST

ABOUT THE AUTHOR

...view details