ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొమ్మమూరు కాలువలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం - గుంటూరుర జిల్లా తాజా వార్తలు

స్నేహితులతో సరదాగా ఈతకు దిగిన వ్యక్తి మృతదేహం ఈరోజు లభ్యమైంది. గుంటూరు జిల్లా కొమ్మమూరు కాలువలో పవన్​ కుమార్​ అనే వ్యక్తి శనివారం ఈతకు దిగాడు...నీటి ఒరవడికి కొట్టుకుపోయిన పవన్ మృతదేహం నరసాయపాలెం లాకుల వద్దకు కొట్టుకొచ్చింది.

dead boady found in guntur dst bapatla died due to swimming in kommamour canel
dead boady found in guntur dst bapatla died due to swimming in kommamour canel

By

Published : Aug 24, 2020, 7:29 PM IST

గుంటూరు జిల్లా కొమ్మమూరు కాలువలో దిగి పవన్‌కుమార్ అనే వ్యక్తి గల్లంతైన ఘటన వడ్లమూడిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. తెనాలికి చెందిన పవన్ కుమార్ ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తుంటారు, శనివారం వినాయక చవితి సందర్భంగా వడ్లమూడిలో ఉన్న మిత్రులను కలిసేందుకు వచ్చి, అందరూ కలసి కొమ్మమూరు కాలువలో ఈతకు దిగారు. కాసేపటికే పవన్ కుమార్ నీటి ఒరవడికి కొట్టుకుపోగా, నేడు బాపట్ల మండలం నరసాయపాలెం లాకుల వద్ద మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ABOUT THE AUTHOR

...view details