ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జూనియర్​ అసిస్టెంట్ ఆరోగ్యంపై స్పందించిన జేసీ ప్రశాంతి

గుంటూరు జిల్లా గురజాలలో ప్రభుత్వ ఉద్యోగి ఆరోగ్యం విషమించడంపై జేసీ స్పందించారు. కరోనా నుంచి కోలుకోవడానికి అవసరమైన పూర్తి చికిత్స అందించాలని సదరు ఆసుపత్రి యాజమాన్యానికి సూచించారు. వారి కుటుంబానికి భరోనా కల్పించారు.

జేసీ ప్రశాంతి
జూనియర్​ అసిస్టెంట్ ఆరోగ్యంపై స్పందించిన జేసీ ప్రశాంతి

By

Published : Apr 21, 2021, 7:46 PM IST

గుంటూరు జిల్లా గురజాల ఆర్డీఓ కార్యాలయంలో జూనియర్​ అసిస్టెంట్​గా పనిచేస్తున్న ఉద్యోగి కరోనాతో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించింది. దీనిపై చికిత్స అందించేందుకు రూ. 60 వేలు ఖరీదైన ఇంజెక్షన్​ ఇవ్వవలసి ఉంటుందని వైద్యులు తెలపడంతో వారు మానవతావాదుల సహకారం అభ్యర్థించారు.

స్పందించిన జేసీ..

దీనిపై స్పందించిన జేసీ ప్రశాంతి సదరు ఉద్యోగికి అవసరమైన పూర్తి చికిత్స అందించాలని తులసి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడారు. రెవెన్యూ ఉద్యోగులను ఆసుపత్రికి పంపి బాధితుడి భార్యకు, కుటుంబసభ్యులకు ధైర్యం ఇచ్చారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని జేసీ హామీ ఇచ్చారు.

సదరు ఉద్యోగి చికిత్సకు ఆర్థిక సహకారం అందించాలనుకునే వారు 9059344656 నెంబర్​కు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా డబ్బు పంపాలని వారి కుటుంబ సభ్యులు అభ్యర్థిస్తున్నారు.

ఇవీ చదవండి:

'అమరావతి రైతుల కోసం వైఎస్ షర్మిల పోరాడాలి'

బంగాల్ దంగల్​: ఆరో విడతలో 43స్థానాలకు పోలింగ్​

ABOUT THE AUTHOR

...view details