ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తండ్రికి అంత్యక్రియలు నిర్వహించిన కుమార్తెలు - తలకొరివి

కొడుకులు తండ్రికి తలకొరివి పెట్టడం సర్వసాధారణం. కానీ తండ్రి మరణాన్ని దిగమింగుకున్న ఆ ఐదుగురు కుమార్తెలు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఈ ఘటన గుంటూరు జిల్లా సీతానగర్​లో జరిగింది.

daughters completed last rights
తండ్రికి తలకొరివి పెట్టిన ఐదుగురు కుమార్తెలు

By

Published : Jun 15, 2021, 8:14 PM IST

కని, పెంచి ఉన్నత చదువులు చదివించి తమను ప్రయోజకుల్ని చేసిన తండ్రి చనిపోతే కుమార్తెలే అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. గుంటూరు జిల్లా సీతానగరానికి చెందిన విశ్రాంత అధికారి ఉప్పాల రామకోటేశ్వరరావు మృతి చెందగా.. అతని కుమార్తెలే అంత్యక్రియలు నిర్వహించారు. రామకోటేశ్వరరావుకు కుమారులు లేరు. కుమార్తెలే అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

ఐదుగురు కుమార్తెల్లో మూడో కుమార్తె మాధవిలత తుళ్లూరులో పీహెచ్‌సీ డాక్టర్​గా పనిచేస్తున్నారు. ఆమె తలకొరివి పెట్టగా.. మిగతా నలుగురు కుమార్తెలు సహకరించారు. సహకార శాఖలో జిల్లా రిజిస్ట్రార్​గా పనిచేసి రిటైరైన రామకోటేశ్వరరావు తన ఐదుగురు కుమార్తెలను ఉన్నత చదువులు చదివించడంతో.. వారు ప్రస్తుతం వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. పెద్ద దిక్కును కోల్పోయిన విషాదంలోనూ మనో నిబ్బరం కోల్పోకుండా తమ కర్తవ్యాన్ని నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details