గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్నతల్లినే హత్య చేసిందో ఘాతుకురాలు. జిల్లాలోని నగరపాలెంకు చెందిన ఆలపాటి లక్ష్మీని... తన కూతురు భార్గవి ఆస్తి కోసం కొంతకాలంగా వేధిస్తోంది. తల్లి పేరుపై ఉన్న ఆస్తిని... తన పేరున రాయాలంటూ భర్త, బావతో కలిసి ఒత్తిడికి గురిచేస్తోంది. అందుకు లక్ష్మి ఒప్పుకోలేదు. తన బావ శివరావుతో కలిసి తల్లిని హత్య చేయటానికి గతంలో ఓసారి ప్రయత్నించింది.
ఆస్తి ముందు అమ్మ ప్రేమ కనిపించలేదు - daughter kills mother for land latest news
ఆస్తి కోసం కన్నతల్లినే కర్కశంగా హత్య చేసిన ఉదంతం ఇది. అల్లారుముద్దుగా పెంచిన తల్లి ప్రేమ... ఆస్తి ముందు కనిపించలేదు. మరో వ్యక్తితో కలిసి ఊపిరాడకుండా చేసింది ఓ కూతురు.
నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
శివరావు, రామాంజనేయులు, భార్గవి కలిసి ఈ నెల 10న లక్ష్మీ ఇంటికి వెళ్లి... ఆమె గొంతు నులిమి హత్య చేశారు. తన తల్లి సహజంగానే మృతి చెందినట్లు అందిరిని నమ్మించింది కూతురు. భార్గవిపై అనుమానం వచ్చి... బంధువులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా... పోలీసులు తమదైన శైలిలో విచారించారు. తామే ఈ హత్య చేసినట్లు ఒప్పుకున్నారు.
ఇదీ చదవండి: మరో తాపీమేస్త్రి ప్రాణం తీసిన ఇసుక
Last Updated : Oct 31, 2019, 6:25 PM IST