ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చదువుకుంటానంటే ఇంట్లోంచి వెళ్లగొట్టారు... విశ్రాంత ఎస్పీపై కోడలి ఫిర్యాదు

ఉన్నత చదువులు చదువుతున్నందుకు అత్తమామలు తనను ఇంటి నుంచి గెంటేశారంటూ.... గుంటూరులో విశ్రాంత ఎస్పీ కోడలు మీడియా ముందుకు వచ్చారు. రెంటచింతల, గుంటూరు దిశా పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు వెల్లడించిన బాధితురాలు... తన మామ విశ్రాంత ఎస్పీ కావడంతో రెండు చోట్లా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆరోపించారు.

DAUGHTER IN LAW COMPLAINT RETIRED SP IN GUNTUR
బాధిత యువతి

By

Published : Dec 25, 2020, 11:08 AM IST

ఉన్నత చదువులు చదువుతానంటే ఇష్టంలేకే విశ్రాంత ఎస్పీ అయిన మామ, అత్త తనను ఇంటి నుంచి వెళ్లగొట్టారంటూ బాధిత యువతి గురువారం గుంటూరు నగరంపాలెం రోడ్డుపై నిరసన తెలిపారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు.

ఆమె ఏమి ఆరోపణలు చేశారంటే "రెంటచింతల మండలానికి చెందిన నాకు, అదే ప్రాంతానికి చెందిన ఓ విశ్రాంత ఎస్పీ కుమారుడితో 2017లో పెద్దలు వివాహం చేశారు. నా భర్త పెద్దగా చదువుకోలేదు. దీంతో నేను ఉన్నత చదువులు చదువుకుని శాస్త్రవేత్త కావాలని ఆశపడుతున్నాను. నేను అచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మైక్రోబయోలజీలో పీజీ చేస్తున్నా. ఈ క్రమంలో నా తల్లికి క్యాన్సర్‌ సోకింది. ఆమెను బెంగళూరు, చెన్నై ఆసుపత్రుల్లో చూపించడానికి పుట్టింటికి వచ్ఛాను. ఆమెను మంచి ఆసుపత్రుల్లో చూపించమని పంపించిన అత్తింటివాళ్లు తర్వాత పట్టించుకోలేదు. మా అమ్మ చనిపోయిన తర్వాత మా అత్తింటికి వెళ్తుంటే రావద్దన్నారు. అక్కడ పెద్దలతో పంచాయితీ పెట్టిస్తే వాళ్లు చెప్పినా వినడం లేదు. అదేమంటే తన కుమారుని కంటే పెద్ద చదువులు చదివితే వారి మాట విననేమో అని అపోహ పడుతున్నారు. అందుకని నాపై లేనిపోని అబద్ధాలు చెబుతూ నన్ను అడ్డు తొలగించుకొని వాళ్ల అబ్బాయికి మరో వివాహం చేయాలని చూస్తున్నారు. రెండు నెలల కిందట రెంటచింతల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశా. తర్వాత దిశ పోలీసు స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశా. మామయ్య విశ్రాంత ఎస్పీ కావడంతో పోలీసులు స్పందించడం లేదు. నా మామ గుంటూరు వచ్చేసి ఇల్లు కట్టుకొని ఉంటున్నారని తెలుసుకొని గురువారం వచ్ఛా ఇంట్లోకి వెళ్లబోతుంటే రావద్దంటూ బయటకు గెంటేశారు. పోలీసులను పిలిపించారు. ఆయన వచ్చి కోడలిని తీసుకువెళ్ల వచ్చని నచ్చచెప్పినా అత్తమామలు వినిపించుకోలేదు. నా దుస్తులు, సర్టిఫికెట్లు ఇవ్వకుండా వెళ్లగొట్టేశారు. అధికారులు న్యాయం చేయాలని వేడుకుంటున్నా"

ABOUT THE AUTHOR

...view details