DARGA TO DURGA WALK : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ సమైక్యతను చాటిచెబుతూ గుంటూరులో దర్గా టూ దుర్గా వాక్ నిర్వహించారు. దేశం కోసం... యువత బాధ్యతలను, లౌకికవాద విశిష్టతను చాటిచెబుతూ 12 ఏళ్లుగా వీవీఐటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గుంటూరులోని హజరత్ కాలేషా మస్తాన్ దర్గా నుంచి విజయవాడలోని దుర్గ గుడి వరకు 33 కిలోమీటర్ల మేర నడక కొనసాగనుంది. వీవీఐటీ విద్యాసంస్థల ఛైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ జెండా ఊపి వాక్ ను ప్రారంభించారు. దేశభక్తి, సామాజిక బాధ్యత, సోదరభావం విద్యార్థి దశ నుంచే అలవరచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రదర్శన చేపడుతున్నట్లు తెలిపారు.
యువతకు దేశ బాధ్యత, లౌకికవాద విశిష్టతలను తెలపాలనే ఉద్దేశంతో దర్గా టూ దుర్గా వాక్ - స్వామి వివేకానంద జయంతి దర్గా టూ దుర్గా వాక్
DARGA TO DURGA WALK IN GUNTUR : భారతదేశంలో జన్మించి, ఈ కర్మభూమి ఔన్నత్యాన్ని సగర్వంగా చాటిచెప్పిన స్వామి వివేకానంద 160వ జయంతి సందర్భంగా జాతీయ సమైక్యతను చాటిచెబుతూ గుంటూరులో దర్గా టూ దుర్గా వాక్ నిర్వహించారు.

DARGA TO DURGA WALK IN GUNTUR
యువతకు దేశ బాధ్యత, లౌకికవాద విశిష్టతలను తెలపాలనే ఉద్దేశంతో దర్గా టూ దుర్గా వాక్