ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేరెంట్స్ ..కాస్త పిల్లలు ఏం చేస్తున్నారో గమనించండి! - danger zone kids in guntur district latest news

కరోనా కాలం.. పిల్లలకు స్కూళ్లు లేవు. బయటికి వెళ్లి ఆడుకోలేని పరిస్థితి. ఏ ఆట అయినా ఇంట్లోనే ఆడుకునే దుస్థితి. ఈ క్రమంలో వారు ఏం చేస్తున్నారో వారికే తెలియని పరిస్థితి. ఈ క్రమంలో వారు కొన్ని సార్లు ప్రమాదం బారిన పడుతున్నారు. తల్లిదండ్రులూ పిల్లలను కాస్త గమనించాలి.

danger zone kids in guntur district
danger zone kids in guntur district

By

Published : Jul 23, 2020, 12:17 AM IST

కరెంటు తీగలపై ఉన్న బంతిని తీస్తున్న పిల్లలు

గుంటూరులో బంతితో ఇంట్లో ఆడుకుంటున్నారు కొందరు పిల్లలు. బంతి ఎగిరి కరెంటు తీగల మీద పడింది. వారి తలిదండ్రులు గమనించలేదు. పిల్లలు ఆ బంతిని కరెంటు తీగలపై నుంచి తీసేందుకు ప్రమాదకర పరిస్థితిలో ప్రయత్నించారు. ఆ సమయానికి పరిసరాల్లో ఉన్న వ్యక్తులు చూశారు కాబట్టి సరిపోయింది. వారు అప్రమత్తం చేయడంతో పిల్లల తల్లిదండ్రులు చూసి.. తమ పిల్లలు ప్రమాదం బారిన పడకుండా కాపాడుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details