గుంటూరు జిల్లా దుర్గిలో విషాదం నెలకొంది. అప్పుల బాధ తట్టుకోలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుల మందు తాగి బలుసు అప్పారావు, అతని భార్య సుధావాణి ఆత్మహత్య చేసుకున్నారు. వీరు గతంలో వస్త్ర దుకాణం నిర్వహించేవారు. అందులో 40 లక్షల రూపాయల వరకు నష్టం వచ్చింది. అప్పు తీర్చాలంటూ వారిపై ఒత్తిడి పెరిగింది. 14 ఎకరాల పొలం అమ్మినా అప్పు తీరదని భావించి.. మనస్థాపంతో దంపతులు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని గ్రామస్థులు భావిస్తున్నారు. భార్య భర్తల మరణంతో గ్రామంలో విషాధ ఛాయలు నెలకొన్నాయి . తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో.. వారి ఇద్దరు పిల్లలు హేమంత్, హర్షిత అనాధలుగా మిగిలారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుల భారంతో ఆలు, మగలు ఆత్మహత్య - suicide
గుంటూరు జిల్లా దుర్గిలో అప్పుల బాధ తట్టుకోలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడం వలన.. వారి పిల్లలు అనాథలుగా మిగిలారు.
దంపతుల ఆత్మహత్య....