ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వరద విలయం.. విద్యుత్ శాఖకు అపారనష్టం

By

Published : Oct 17, 2020, 10:55 PM IST

గుంటూరు జిల్లా వరదల కారణంగా నష్టం వాటిల్లింది. చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు, ట్రాన్సుఫార్మర్లు, కండక్టర్ వైర్లు దెబ్బ తిన్నాయి. వరదలు తగ్గాక మరమ్మతులు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

damage to electricity department at floods
వరదల కారణంగా విద్యుత్ శాఖకు అపారనష్టం

భారీ వర్షాలు, కృష్ణా నదికి వరదలతో గుంటూరు జిల్లా పరిధిలో విద్యుత్ శాఖకు అపారనష్టం వాటిల్లింది. కొల్లూరు, కొల్లిపర, భట్టిప్రోలు మండలాల పరిధిలోని లంక గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్సుఫార్మర్లు, కండక్టర్ వైర్లు దెబ్బతిన్నాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం కొల్లూరు మండలంలో 750, కొల్లిపర మండలంలో 54, భట్టిప్రోలు మండలంలో 74 వ్యవసాయ విద్యుత్ నియంత్రికలు... 838 ట్రాన్సుఫార్మర్లు వరదల్లో చిక్కుకున్నాయి. మొత్తం రూ. 7.7 లక్షల మేర నష్టం వాటిల్లింది.

ఈ మండలాల పరిధిలో 295 విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. రూ. 2.9 కోట్ల విలువైన 20 కిలోమీటర్ల పొడవైన కండక్టర్ వైరు, 33 కిలోమీటర్ల మేర కేబుల్ వైర్లు మునిగిపోవడంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లిందని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు. వరదలు తగ్గాక పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వరదల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన సిబ్బందిని ట్రాన్సుకో ఎస్ఈ విజయ్ కుమార్ అభినందించారు.

ఇదీ చదవండి: హెచ్చరిక: రాగల 4 గంటలపాటు రాష్ట్రంలో వర్షాలు

ABOUT THE AUTHOR

...view details