రాజధానిలో ఇసుక, కంకర.. పరుల పాలవుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఎస్సీ ఐకాస నేతలు ఆరోపించారు. హైకోర్టు సమీపంలో ఉన్న ఇసుక గుట్టలను కొంత మంది వ్యక్తులు తీసుకపోవడాన్ని ఎస్సీ రైతులు తప్పుపట్టారు. పోలీసుల తీరును నిరసిస్తూ రైతులు ఆందోళన చేశారు. అత్యంత భద్రత ఉన్న ప్రాంతంలో ఇసుక చోరీ చేస్తుంటే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
PROTEST: ఇసుక, కంకర అక్రమంగా తరలిస్తున్నారని ఎస్సీ ఐకాస నేతల ధర్నా - గుంటూరు జిల్లా తాజా వార్తలు
రాజధాని ప్రాంతంలో ఇసుక, కంకర అక్రమంగా తరలిస్తున్నారని ఎస్సీ ఐకాస నేతలు ఆరోపించారు. హైకోర్టు సమీపంలో ఇసుక గుట్టలను కొంత మంది వ్యక్తులు తరలించడాన్ని రైతులు తప్పు పట్టారు. ఈ మేరకు పోలీసుల తీరును నిరసిస్తూ వారు ఆందోళన చేశారు.
ఇసుక, కంకర అక్రమంగా తరలిస్తున్నారని ఎస్సీ ఐకాస నేతల ధర్నా
ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే అధికార పార్టీకి చెందిన కొంతమంది.. రాత్రుళ్లు ఇసుక తరలిస్తున్నారని తెలిపారు. ఉద్ధండరాయునిపాలెంలో కంకర, హైకోర్టు వద్ద ఉన్న ఇసుక తీసుకెళ్తుంటే అధికారులు ఏంచేస్తున్నారని రైతులు ప్రభుత్వాన్ని నిలదీశారు. అమరావతిని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం, అధికార పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.