రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ , మైనార్టీలు దాడులకు గురైతే దళిత బహుజన సంఘాల ఐకాస అండగా నిలవాలని చదలవాడ అరవింద బాబు సూచించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన దళిత బహుజన సంఘాల ఐకాస రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. నూతనంగా ఏర్పాటైన కమిటీలో నరసరావుపేట, గుంటూరు జిల్లా సంబంధించిన అట్లూరి విజయ్ కుమార్ను దళిత బహుజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
బహుజన సంఘాల ఐకాస భేటీ.. సమస్యలపై చర్చ - నరసరావు పేట దళిత బహుజనుల సమావేశం
గుంటూరు జిల్లా నరసరావుపేటలో దళిత బహుజన సంఘాల ఐకాస రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ, క్రైస్తవ సంఘాల సమస్యలపై, వారిపై జరుగుతున్న దాడులపై చర్చించారు.
![బహుజన సంఘాల ఐకాస భేటీ.. సమస్యలపై చర్చ dalita bahujana meetng](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10209015-537-10209015-1610421104237.jpg)
దళిత బహుజన సంఘాల జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం