ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఎస్సీలకు మనుగడ లేకుండా చేసేందుకే వైకాపా కుయుక్తులు' - Capital SC farmers and leaders meeting at Velagapudi ICASA office

రాజధాని ఎస్సీ రైతులు, నేతలు... గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి ఐకాస కార్యాలయంలో సమావేశమయ్యారు. ఎస్సీలకు మనుగడ లేకుండా చేసేందుకు వైకాపా ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని రైతుల ఐకాస ఆరోపించింది.

వెలగపూడి ఐకాస కార్యాలయంలో రాజధాని ఎస్సీ రైతులు, నేతలు సమావేశం
వెలగపూడి ఐకాస కార్యాలయంలో రాజధాని ఎస్సీ రైతులు, నేతలు సమావేశం

By

Published : Mar 30, 2021, 4:17 PM IST

Updated : Mar 30, 2021, 5:58 PM IST

అసైన్డ్ భూముల వ్యవహారంలో గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పెట్టిన కేసు.... న్యాయస్థానాలలో నిలబడదని హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారాయణ చెప్పారు. వెలగపూడి ఐకాస కార్యాలయంలో రాజధాని ఎస్సీ రైతులు, నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి 29 గ్రామాల్లోని ఎస్సీ రైతులు హాజరయ్యారు.

గత ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.41లేకపోతే రాజధాని ప్రాంతంలోని అసైన్డ్ భూములను ఇప్పటి ప్రభుత్వం గంపగుత్తగా తన బినామీలకు అప్పగించేందని న్యాయవాది లక్ష్మీనారాయణ చెప్పారు. ఎస్సీలకు మనుగడ లేకుండా చేసేందుకు వైకాపా ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని రైతుల ఐకాస ఆరోపించింది. ఎస్సీలకు కేటాయించిన టిడ్కో ఇళ్లను వెంటనే ఇవ్వాలని, వైకాపా ప్రభుత్వం చెప్పిన విధంగా భూమిలేని నిరుపేదలకు నెలకు 5ఇస్తామన్న హామిని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

Last Updated : Mar 30, 2021, 5:58 PM IST

ABOUT THE AUTHOR

...view details