తుళ్లూరులో వైకాపా నేతల తీరుని నిరసిస్తూ గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. రాజకీయాల కోసం మా భూములపై రాద్దాంతం చేస్తోందని ఆక్షేపించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత తమ భూముల విలువలు పడిపోయాయన్నారు.
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై కేసు పెడతాం: అమరావతి దళిత ఐకాస
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఇతర నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతామని అమరావతి దళిత ఐకాస నేతలు తెలిపారు. రాజధానిలో ఎస్సీలకు వైకాపా ప్రభుత్వం ఇస్తామన్న హామీలు అమలు చేయకుండా తమను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
దళిత ఐకాస నేతల ధర్నా
Last Updated : Mar 20, 2021, 11:18 AM IST