ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్దండరాయునిపాలెంలో మోకాళ్లపై కూర్చొని దళిత రైతుల నిరసన - ఉద్దండరాయునిపాలెంలో రైతుల ధర్నా

గుంటూరు జిల్లా ఉద్దండరాయునిపాలెం శిబిరంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహం ముందు మోకాళ్లపై కూర్చొని రైతుల నిరసన తెలిపారు.

dalit farmers protest at uddandarayunipalem
ఉద్దండరాయునిపాలెంలో మోకాళ్లపై కూర్చొని దళిత రైతుల నిరసన

By

Published : Sep 2, 2020, 1:27 PM IST

తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో దళిత రైతులు, మహిళలు అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసి..... విగ్రహం ముందు మోకాళ్లపై కూర్చొని ధర్నా చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహానికి పూల మాల వేసి 260వ రోజు దీక్షలను ప్రారంభించారు. రాజధానిలో దళితులకు వైకాపా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. దళిత రైతులకు ఐదు వేల పెన్షన్, జరీబు భూములతో సమాన ప్యాకేజీ ఇస్తామన్న ప్రభుత్వం ఇంతవరకు తమ హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. సాంకేతిక కారణాలు చెప్పి అసైన్డ్ రైతులకు కౌలు నిలిపివేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details