రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని అరెస్టు చేయాలని... గుంటూరులో దళిత సంఘాల నేతలు నిరసనకు దిగారు. అయ్యన్నపాత్రుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గుంటూరు లాడ్జి సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.
అయ్యన్నపాత్రుడు బహిరంగ క్షమాపణ చెప్పాలి: మాల మహానాడు - గుంటూరులో మాలమహానాడు నేతల ఆందోళన
గుంటూరులో మాల మహానాడు నాయకులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర హోంమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెదేపా నేత అయ్యన్నపాత్రుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
నిరసనకు దిగిన మాలమహానాడు నాయకులు
ఈ సందర్భంగా మాల మహానాడు అధ్యక్షుడు గోళ్ళ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ దళిత మహిళా హోంమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపై కేసు నమోదు చేయాలన్నారు. తక్షణమే అయ్యన్న బహిరంగ క్షమాపణ చెప్పాలనీ.. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్‌ను సందర్శించిన జీవీఎల్