దుర్గిలోని డాల్ మిల్లులో పనిచేసే గుమాస్తా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని గ్రామానికి చెందిన పులి వెంకట సాయి కుమార్‌గా పోలీసులు గుర్తించారు.
ఘటనకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.