వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే తమ లక్ష్యమని సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ఆయన నూతనంగా బేకరీ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేశారు. కరోనా సమయంలో ఆరోగ్యానికి రక్షణ కలిగించే నాలుగు రకాల బాదం పాలను మార్కెట్లోకి విడుదల చేసినట్లు తెలిపారు. ఇప్పటికే వాటికి ప్రజల్లో మంచి ఆదరణ లభించిందని వివరించారు. విజయవాడకు చెందిన బీటీ బేకరీ సంఘంతో కలిసి గుంటూరులోనూ ఉత్పత్తుల విక్రయం చేపడుతున్నామని పేర్కొన్నారు.
మార్కెట్లోకి సంఘం డెయిరీ బేకరీ ఉత్పత్తులు - sangam dairy products on the market
గుంటూరు జిల్లా పొన్నూరు వద్ద సంఘం డెయిరీ ఆధ్వర్యంలో నూతనంగా బేకరీ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటయ్యింది. పాల సేకరణతో పాటు వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే తమ లక్ష్యమని డెయిరీ ఛైర్మన్ తెలిపారు.
![మార్కెట్లోకి సంఘం డెయిరీ బేకరీ ఉత్పత్తులు Dairy Bikery products](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9794824-733-9794824-1607342904700.jpg)
బైకరీ ఉత్పత్తులు మార్కెట్లోకి విడుదల